పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే దాదాపుగా 20 ఏళ్ల ముందు నుంచి పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే పవన్ కళ్యాణ్ 2002 సంవత్సరంలోనే పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది.
వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా గుడుంబా శంకర్ డైరెక్టర్ వీర శంకర్( Veera Shankar ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే పవన్ కు కొంతమంది నిర్మాతలు 10 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారని అన్నారు.ఆ సమయంలో రజనీకాంత్ కూడా ఆ రేంజ్ లో పారితోషికం తీసుకునేవారు కాదని వీర శంకర్ అన్నారు.పవన్ కు ఆ సమయంలోనే ఈ స్థాయిలో క్రేజ్ ఉండేదని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
పవన్ కళ్యాణ్ రేంజ్ ఇదీ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.2002లో 10 కోట్ల రూపాయల పారితోషికం పొందిన పవన్ ఇప్పుడు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు.
ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి( Surender Reddy ) కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయింది.పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరికొన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పవన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.