టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఆరేళ్ల పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఒకరు.ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉండగా మైత్రీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.
ఎన్టీఆర్ క్రేజ్ కు ప్రభాస్ క్రేజ్ తోడైతే క్రియేట్ అయ్యే రికార్డులు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కేజీఎఫ్3, సలార్2( KGF3, Salar2 ) సినిమాల మధ్య లింక్ ఉందని గతంలో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఈ వార్తల గురించి హీరో యశ్ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది.ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి లింక్ లేదని వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ వార్తలు అని యశ్ చెప్పుకొచ్చారు.కేజీఎఫ్3 సినిమా కచ్చితంగా తెరకెక్కుతుందని యశ్ వెల్లడించడం గమనార్హం.
అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా కేజీఎఫ్3 ఉంటుందని యశ్( Yash) పేర్కొన్నారు.యశ్ క్లారిటీతో కేజీఎఫ్3 మూవీ భారీ రేంజ్ లో ఉండబోతుందని అర్థమైంది.కేజీఎఫ్3 సెట్స్ పైకి వెళ్లడానికి మరో నాలుగేళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది.కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.కేజీఎఫ్3 సినిమాను ప్రశాంత్ నీల్ ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.యశ్ సైతం గతంలోలా కాకుండా నిదానంగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు.కేజీఎఫ్3 సినిమాకు సంబంధించి ప్రశాంత్ నీల్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.కేజీఎఫ్3, సలార్2 సినిమాలు రాబోయే రోజుల్లో ఎలాంటి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.సోషల్ మీడియాలో ఈ సినిమాల గురించి ఎంతగానో చర్చ జరుగుతోంది.