కోతికి, మనిషికి పోలికలు ఉన్నాయనడానికి ఈ ఘటన చాలు..!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు అయితే బాగా ట్రేండింగ్ గా మారుతున్నాయి.

 This Incident Is Enough To Show That There Are Similarities Between Monkey And-TeluguStop.com

ఈ క్రమంలోనే కోతికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.మకర సంక్రాంతి పండగ రోజున కోతి చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మనిషి కోతి నుంచి వచ్చాడని చాలా మంది అంటూ ఉంటారు.కానీ.

, వాటికి సంబందించిన ఆధారాలు అయితే లేవు కానీ ఒక్కోసారి కోతులు చేసే పనులు చూస్తుంటే అచ్చం మనుషులలాగానే ప్రవర్తిస్తుంటాయి.ఇప్పుడు అలాంటి వింత ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సంక్రాంతి పండగ వేళ పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంచక్కా గాలిపటాలు ఎగరవేస్తారు కదా.అయితే ఈ కోతి కూడా సంక్రాతి పండగ సందర్బంగా గాలి పటం ఎగరవేసి తెగ సంబర పడిపోయింది.ఈ ఘటన వినడానికి, చూడడానికి వింతగా ఉన్న నిజంగానే జరిగింది.ఈ కోతి మనుషులవలే గాలిపటం ఎగరవేయడాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

అసలు వివరాల్లోకి వెళితే.ఉత్తరప్రదేశ్‌ లఖీంపూర్‌ ఖేరీ ప్రాంతానికి సమీపంలోని సదర్ కొత్వాలి అనే ప్రాంతంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది.

మకర సంక్రాంతి వేళ ఒక కోతి దర్జాగా డాబాపై కూర్చుని గాలిపటం ఎగరవేసింది.

ఆ గాలిపటం గాల్లో పైకి ఎగరినంత సేపు ఆ దారాన్ని కోతి చేతితో అటు ఇటు తిప్పుతూ గాలిపటం కింద పడకుండా పట్టుకొని పైకి ఎగరవేస్తుంది.

అయితే గాలి పటం పైకి ఎగరవేయడంలో దాన్ని బలం సరిపోలేదేమో అది కిందపడిపోవడంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది.కానీ చాలాసేపు ఆ గాలి పటం కిందకు పడకుండా మాత్రం పట్టుకుంది.

కోతి గాలిపటం ఎగురవేయడం చూసి చుట్టు పక్కల వాళ్లంతా ఆ వింతను చూస్తూ ఉన్నారు.కొందరు తమ సెల్ ఫోన్స్ లో కోతి వీడియోని రికార్డ్‌ చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ వీడియో చుసిన నెటిజన్లు అందరు కోతిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube