భారత్- అమెరికాల మధ్య వాణిజ్యం, ఆర్ధిక సంబంధాలకు ఈ ఏడాది ముఖ్యమైనదిగా అభివర్ణించారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సింధూ.గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.
ఇరు దేశాల మధ్య ఆర్ధిక భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.గతేడాది భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 160 బిలియన్ డాలర్లకు పైగా చేరుకుందని సంధూ గుర్తుచేశారు.
ఎలాంటి అధికారిక వాణిజ్య ఒప్పందం లేకుండానే, సప్లై చైన్ అంతరాయాలు ఉన్నప్పటికీ, కోవిడ్ సమయంలోనూ తాము ఈ ఘనతను సాధించామని తరంజిత్ వెల్లడించారు.భారత్‌తో బలమైన సంబంధాలు వున్న వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీకి చెందిన వ్యాపార ప్రతినిధి బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి వర్జీనియా వాణిజ్య కార్యదర్శి కారెన్ మెరిక్.వ్యవసాయ, అటవీశాఖ కార్యదర్శి మాథ్యూ లోహ్ర్.ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ అథారిటీ విక్టర్ హోస్కిన్స్ సీఈవో హాజరయ్యారు.అమెరికాలో 200 భారతీయ కంపెనీలు , భారత్‌లో 2 వేలకు పైగా అమెరికా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సంధూ అన్నారు.
ఇకపోతే.2019లో భారత్- వర్జీనియాల మధ్య 1.65 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.దీనిపై 15 శాతం వృద్ధిని అంచనా వేశారు.ఇదే సమయంలో భారత్ నుంచి వర్జీనియాకు 644.44 మిలియన్ డాలర్ల ఎగుమతులు వుండగా.వర్జీనియా నుంచి 1.01 బిలియన్ డాలర్ల దిగుమతులు వున్నాయి.వర్జీనియా నుంచి భారత్‌కు దిగుమతయ్యే వాటిలో ఖనిజాలు, వ్యర్థాలు, స్క్రాప్స్, రసాయనాలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, పెట్రోలియం, బొగ్గు ఉత్పత్తులు వున్నాయి.ఇక భారత్ నుంచి వర్జీనియాకు ఎగుమతయ్యే వాటిలో టైక్స్‌టైల్ ఉత్పత్తులు, రసాయనాలు, దుస్తుల తయారీ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, విద్యుత్ ఉపకరణాలు మొదలైనవి వున్నాయి.