నన్ను అలా పిలిచేవాళ్ళు నాకు శత్రువులు.. త్రివిక్రమ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటీ?

ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలన్ని మంచి సక్సెస్ లు అందుకున్నాయి.

 They Call Me Like That What Is The Motive Behind Trivikrams Comments, Trivikram,-TeluguStop.com

ఈయన ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తాడు.ఈయన కొత్త హీరోలకు కాకుండా స్టార్ హీరోలకు మాత్రమే అవకాశాలు ఇస్తాడు.

గతంలో ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.ఇదిలా ఉంటే తనను ఎవరైనా ఆ పేరుతో పిలిస్తే వాళ్లు తనకు శత్రువులే అంటే కామెంట్ చేశాడు.

త్రివిక్రమ్ దర్శకుడిగానే కాకుండా మాటల రచయితగా, కథా రచయితగా కూడా బాధ్యతలు చేపట్టాడు.మొదట స్వయంవరం సినిమాతో మాటల రచయితగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి పలు సినిమాలకు కథ అందించాడు.అంతేకాకుండా స్క్రీన్ ప్లే రచయితగా కూడా చేశాడు.

ఆ తర్వాత అతడు, జులాయి వంటి పలు సినిమాలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా వరకు తన దర్శకత్వంలో నటించిన స్టార్ హీరోలకు కూడా మంచి సక్సెస్ అందించాడు.

Telugu Tollywood, Trivikram-Movie

ఇక ఈయనను చాలావరకు మాటల మాంత్రికుడు అని పిలవడమే కాకుండా పలు సందర్భాల్లో ఈయన గురించి రాస్తున్నప్పుడు కూడా మాటల మాంత్రికుడు అని బాగా వాడుతారు.ఎందుకంటే ఈయన చెప్పే డైలాగులు ఓ రేంజ్ లో ఉంటాయి.కొందరు పంచ్ డైలాగ్ కింగ్ అని కూడా పిలుస్తుంటారు.కానీ త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అని పిలిపించుకోవడం అస్సలు నచ్చదట.అలా ఎవరైనా పిలిస్తే తనకు కోపం వస్తుందని తెలిపాడు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్.

తను పంచ్ డైలాగులు బాగా రాస్తానని అనడంతో కొందరు పంచ్ డైలాగ్ కింగ్ అని మరికొందరు మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారని తెలిపాడు.అలా పిలిస్తే తనకు నచ్చదని.

నిజానికి తనకు పంచ్ డైలాగ్స్ రాయడం రాదని తెలిపాడు.పదిమందిలో కూర్చున్నప్పుడు అందులో వచ్చే డైలాగ్స్ గురించి కూడా డిస్కస్ చేయను అని తెలిపాడు.

Telugu Tollywood, Trivikram-Movie

ఇక తను రాసుకునే లైన్స్ స్పాంటేనియస్లీగా ఉండేలా చూసుకుంటానని తెలిపాడు.ఇక ఆయనను కొందరు ప్రాస డైలాగులు రాస్తానని అంటారని.అందుకే వాటిని నువ్వే కావాలి సినిమా తర్వాత నుంచి రాయడమే మానేశానని తెలిపాడు.ప్రస్తుతం తన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు తన సొంతంగా వచ్చిన స్టేట్మెంట్ డైలాగులను రాస్తున్నానని.

తన స్టైల్ కాపీ కొట్టడం కూడా చాలా సులభంగా ఉంటుందని తెలిపాడు.

ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అల్లావైకుంఠపురంలో తర్వాత పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

అందులో ఎన్టీఆర్ తో కలిసి అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమాను చేయనున్నాడు.ఇక మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తర్వాత తన దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ రచయితగా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube