నిజానికి ఒక సినిమాని తీసి దాన్ని సక్సెస్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని.దానికోసం విపరీతమైన కష్టాలు పడాల్సి ఉంటుంది.
ఒక సినిమా ప్రేక్షకుడికి కనిపిస్తుంది అంటే దాని వెనకాల చాలామంది కష్టం ఉంటుంది.అందుకే సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) సినిమా చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అందుకే చాలా మంది సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ఇష్టపడరు.
ఇండస్ట్రీకి వచ్చిన వారు మాత్రం ఇక్కడ ఏదో ఒకటి చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే సంకల్పంతో ఉంటూ ముందుకు కదులుతూ ఉంటారు.
ఇక అదే క్రమం లో ప్రస్తుతం వస్తున్న అప్ కమింగ్ దర్శకులు వాళ్ళకంటూ ఒక మంచి పేరు ను తెచ్చుకోవాలని చూస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న వి ఐ ఆనంద్( VI Anand ) ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తను కూడా ఒక మంచి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా సక్సెస్ అయితే తనకి నెక్స్ట్ స్టార్ హీరో నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి…
ఇక ఇంతకుముందు సుబ్రహ్మణ్యపురం, లక్ష్య అనే సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్న సంతోష్ జగర్లపూడి( Santhosh Jagarlapudi ) ఇప్పుడు కూడా సుమంత్ తో మహేంద్రగిరి వారాహీ( Mahendragiri Varahi ) అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఎందుకంటే ఈ సినిమాతో సక్సెస్ కొడితే తనకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు వస్తాయనేది వాస్తవం కాబట్టి
ఈ సినిమా సక్సెస్ మాత్రం తనకు చాలా కీలకంగా మారుబోతుంది.ఇక ఈ ఇద్దరు డైరెక్టర్లు తెలుగులో ఇప్పుడు ఒక సాలిడ్ సక్సెస్ కొట్టి స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలని చూస్తున్నారు నిజానికి వీళ్లిద్దరూ కూడా మంచి టాలెంట్ ఉన్న దర్శకులు కావడం విశేషం…మనకు ఎంత టాలెంట్ ఉన్న కూడా అది ప్రజెంట్ చేసుకోవడానికి ఒక టైం రావాలి.ఇక ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఈ సినిమాలతో వాళ్ల టాలెంట్ ని పూర్తి స్థాయి లో ప్రూవ్ చేసుకొనే ఆ టైమ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది…