సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు.తమ వివాహ బంధంలో ఒడిదుడుకులు తీసుకొని విడిపోయినటువంటి వారు అలాగే భార్య లేదా భర్త మరణించినటువంటి వారు కూడా తిరిగి రెండవ వివాహం చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నటీమణులు తమ భర్త చనిపోయిన కూడా రెండో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే లైఫ్ లో ముందుకు వెళుతున్నారు మరి భర్త చనిపోయిన రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆ సెలబ్రెటీలు ఎవరు ఓసారి లుక్ వేసేద్దాం…
రేఖ:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ(Rekha) తన భర్త ముఖేష్ అగర్వాల్ మరణించిన ఈమె రెండో వివాహం చేసుకోకుండా ఉన్నారు.
జయసుధ:
సహజనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జయసుధ( Jayasudha )తన భర్త నితిన్ కపూర్ చనిపోయిన ఈమె తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి రెండవ వివాహం చేసుకోలేదు.అయితే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చిన ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్నారు.
మీనా:
మీనా (Meena) తన భర్త విద్యాసాగర్ 2022వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.ఇప్పటికీ ఈమె ఒంటరిగా ఉంటూ తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కష్టపడుతున్నారు.
సురేఖ వాణి:
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖవాణి (Surekha Vani) భర్త సురేష్ తేజ 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు కానీ ఈమె మాత్రం రెండో పెళ్లి చేసుకోకుండా తన కూతురి కోసమే బ్రతుకుతున్నారు.
రోహిణి:
ఒకప్పుడు ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రఘువరన్ రోహిణి వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు.కొడుకు జన్మించిన తర్వాత ఈమె తన భర్త నుంచి విడిపోయింది అయితే ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు కానీ ఈమె మాత్రం తదుపరి వివాహం చేసుకోలేదు.
డిస్కో శాంతి:
ప్రముఖ నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి (Disco Shanthi) కూడా ఇండస్ట్రీలో నటిగా కొనసాగిన సంగతి తెలిసిందే అయితే ఈమె శ్రీహరి అనే పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇక శ్రీహరి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన రెండవ వివాహం చేసుకోలేదు తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారి కోసమే కష్టపడుతున్నారు.
భానుప్రియ:
భానుప్రియ (Bhanu Priya) తన భర్త ఆదర్శ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరికి ఒక కుమార్తె జన్మించిన తర్వాత మనస్పర్ధలు రావడంతో తన భర్త నుంచి దూరంగా ఉన్నారో అయితే తన భర్త విదేశాలలోనే ఉన్నారు కానీ ఆయన కూడా మరో వివాహం చేసుకోలేదు ఈమె కూడా విడాకులు తీసుకున్న మరొక వివాహం చేసుకోలేదు అయితే ఇటీవల కాలంలో భానుప్రియ భర్త ఆదర్శ కౌశల్ మరణించారు.
సుమలత:
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి నటి సుమలత (Sumalatha) భర్త నటుడు రాజకీయ నాయకుడు అంబరీష్ 2018 వ సంవత్సరంలో మరణించారు మరణించినప్పటికీ సుమలత మరొక వివాహం చేసుకోలేదు.
విషిత:
ప్రముఖ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ భార్యగా విషిత అందరికి సుపరిచితమే ఉదయ్ కిరణ్ 2014 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు అయితే ఉదయ్ (Uday Kiran) కిరణ్ చనిపోయిన తర్వాత విషిత (Vishitha) రెండో వివాహం చేసుకోలేదని తెలుస్తుంది.ఇలా పలువురు సెలబ్రిటీలు తమ భర్తలు చనిపోయిన ఇప్పటికి రెండో పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు.