కురుల ఆరోగ్యానికి కీర దోసకాయ.. ఇలా వాడితే మీ జుట్టు డబుల్ అవ్వడం ఖాయం!

కీర దోసకాయ. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

 How To Use Cucumber For Double Hair Growth , Cucumber, Cucumber Benefits,-TeluguStop.com

ముఖ్యంగా వెయిట్ లాస్( Weight loss ) కు కీర దోసకాయ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను చేకూరుతుంది.

అందుకే చాలా మంది కీర దోసకాయను సలాడ్స్ లేదా జ్యూసుల ద్వారా తీసుకుంటూ ఉంటారు.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు కీర దోసకాయను విరివిరిగా ఉపయోగిస్తారు.

అంతేకాదు కురుల ఆరోగ్యానికి సైతం కీర దోసకాయ అండగా ఉంటుంది.

Telugu Cucumber, Care, Care Tips, Fall, Healthy, Latest, Thick-Telugu Health

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కీర దోసకాయను( Cucumber ) వాడితే మీ జుట్టు డబుల్ అవ్వడం ఖాయం.అందుకోసం ముందుగా ఒక కీర దోసకాయ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి.

స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలిఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, ( Curd )వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు అర కప్పు కీర దోసకాయ జ్యూస్( Keera Cucumber Juice ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Cucumber, Care, Care Tips, Fall, Healthy, Latest, Thick-Telugu Health

గంట అనంతరం మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం( Hair loss ) చాలా వేగంగా తగ్గుతుంది.హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది.

ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా కూడా కొద్ది రోజుల్లోనే ఒత్తుగా త‌యార‌వుతుంది.అలాగే ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు సమస్య( Dandruff problem ) దూరం అవుతుంది.

జుట్టు ముక్కలవ్వడం, చిట్లడం వంటివి త‌గ్గు ముఖం పడతాయి.కురులు ఆరోగ్యంగా, స్ట్రోంగ్ గా సైతం మార‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube