ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఈ 3 అలవాట్లు మానుకోవాలి!

సాధారణంగా ప్రతి ఒక్కరు వారి కుటుంబం సిరిసంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని భావిస్తారు.ఇలా భావించి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

 These 3 Habits Should Be Avoided If Lakshmi Devi To Stay In Your Home, Lakshmi D-TeluguStop.com

ఇలా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ కొందరి ఇంటిలో మాత్రం డబ్బు నిల్వ ఉండదు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు జీవితంపై కూడా ఎంతో విరక్తి చెందుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.

అయితే మన ఇంట్లో డబ్బు కొలువై ఉండాలంటే కొందరు కొన్ని వాస్తు నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు.అయితే వాస్తు నియమాలతో పాటు మనలో ఉన్న ప్రధానమైన మూడు అలవాట్లను కూడా మానుకున్నప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మరి ఆ అలవాట్లు ఏంటి అనే విషయానికి వస్తే.

భయం: సాధారణంగా చాలా మంది ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎంతో భయపడుతుంటారు.ఇలా భయపడేవారు ఏ పని చేయడానికి ముందడుగు వేయలేరు.ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు.అందుకే ముందుగా మనలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలి.

బద్ధకం: ఒక మనిషి జీవితంలో తన లక్ష్యాలను చేరుకోలేదు అంటే, ఉన్నత స్థాయిలో లేడు అంటే అందుకు గల ప్రధాన కారణం బద్ధకం.బద్ధకం ఉండటంవల్ల ఆ మనిషి ఏ చిన్న పని చేయడానికి ఇష్టపడడు.ఇలా బద్ధకస్తుల దగ్గర కూడా లక్ష్మీదేవి కొలువై ఉండదు.ఎప్పుడైతే మనం బద్ధకం వీడి పనులపై దృష్టి పెడతామో అప్పుడే లక్ష్మీదేవి మన దగ్గర కొలువై ఉంటుంది.

నిద్ర: నిద్ర ఒక మనిషి ఆర్థిక ఎదుగుదలను క్షీణించి వేస్తుంది.ఒక మనిషి కేవలం రోజుకు ఆరు నుంచి ఏడు గంటల వ్యవధి వరకు మాత్రమే నిద్రపోవాలి.అంతకుమించి నిద్ర పోవటం వల్ల వారి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉండదు.అందుకే ఎక్కువ సమయం పాటు నిద్ర పోకుండా ఉండాలి.ఇలా మనలో ఉన్న ఈ అలవాటును మానుకున్నప్పుడే లక్ష్మీ దేవి మన దగ్గర కొలువై ఉంటుంది.

These 3 Habits Should Be Avoided If Lakshmi Devi To Stay In Your Home, Lakshmi Devi, Worship, Hindi Belives, House - Telugu Hindi, Lakshmi Devi, Worship

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube