ఈ దసరా మూవీ లవర్స్ కి మరియు ట్రేడ్ కి ఇచ్చిన ట్రీట్ మామూలు రేంజ్ కాదనే చెప్పాలి.‘లియో’, ‘భగవంత్ కేసరి’ మరియు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించాయి.ఈ మూడు సినిమాల్లో ముందుగా ‘లియో’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించింది.ఈ సినిమా కి వచ్చిన ఓపెనింగ్స్ మామూలివి కాదు.‘భగవంత్ కేసరి’ ( Bhagwant Kesari )మరియు ‘టైగెర్ నాగేశ్వర రావు’ చిత్రాలకు ఊహించిన రేంజ్ ఓపెనింగ్స్ అయితే రాలేదు కానీ, లాంగ్ రన్ లో మాత్రం అదరగోట్టాయి.ముఖ్యంగా ఈ దసరా మొత్తాన్ని బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ చిత్రం తో భారీ లీడ్ తీసుకున్నాడనే చెప్పాలి.
ఈ చిత్రం మొదటి పది రోజుల్లో దాదాపుగా 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ కి అతి దగ్గరగా చేరింది.
బయ్యర్స్ బ్రేక్ ఈవెన్ మార్కు కి చేరుకొని క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే 67 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి.ఈ వారం లో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేస్తుందని అంటున్నారు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దక్కడం వల్ల రన్ ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదని, మరో రెండు వారాలు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ రన్ ఉండొచ్చు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
అయితే సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ ( OTT )విడుదల తేదీ వచ్చేసింది.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెల 23 వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం.
కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ మరియు తమిళం ఆడియోలు కూడా అందుబాటులో ఉంటాయట.
ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు దాదాపుగా పాతిక కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట.ఇప్పటి వరకు ఇది బాలయ్య( Balayya ) కెరీర్ లో హైయెస్ట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఆయన ముందు రెండు చిత్రాలకు థియేటర్స్ తో పాటుగా ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు చెప్తున్నారు.
మరి థియేటర్స్ లో ఆ స్థాయిలో అలరించిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ ని ఇంకెంత అలరిస్తుందో చూడాలి.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలియచెయ్యనుంది.