గూగుల్ క్రోమ్ లో సరికొత్తగా AI ఫీచర్..!

గూగుల్ క్రోమ్( Google Chrom ) బ్రౌజర్ లో సరికొత్త ఏఐ ఫీచర్ త్వరలోనే రాబోతుంది.ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

 గూగుల్ క్రోమ్ లో సరికొత్తగా Ai -TeluguStop.com

ఈ ఫీచర్ పేరు కాంటెక్స్ట్ మెనూ ట్యాబ్ ఫీచర్.గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్ లో అడ్వాన్సుడ్ ఏఐ సెక్షన్ లో ఈ ఫీచర్ కనిపిస్తుంది.

ఈ ఫీచర్ తో సులభంగా ట్యాబ్స్ ను ఆర్గనైజ్, అరేంజ్ చేసుకోవచ్చు.కావాలనుకుంటే ఈ ఫీచర్ తో ఆర్గనైజ్ ట్యాబ్ ఫీచర్ ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.

అడ్వాన్స్డ్ ఏఐ సెక్షన్( Advanced AI section ) లో ఉండే ఈ ఫీచర్ తో యూజర్లు కంపోజ్, ఆర్గనైజ్ ట్యాబ్స్ ఫీచర్లను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చు.ఈ కంపోజ్ అనే ఫీచర్ ఆటో ఫిల్ హెల్పర్ ఆప్షన్ కు సంబంధించినది.

ఈ ఫీచర్ తో వెబ్ పేజీలలో బ్లాక్ ఫామ్స్, ఫీల్డ్స్ లో డీటెయిల్స్ ఫిల్ చేయడంలో ఉపయోగపడుతుంది.

Telugu Advanced Ai, Ai, Google Chrome-Technology Telugu

ఆర్గనైజ్ ట్యాబ్స్ అనే ఫీచర్ ట్యాబ్స్ ను ఆటోమేటిక్ గా ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించే యూజర్లకు చాలా ఉపయోగపడుతుందట.ఎందుకంటే.

గూగుల్ క్రోమ్ యూజర్ ఎక్కువ సంఖ్యలో ట్యాబ్స్ తెరచినప్పుడు, ఆర్గనైజ్ ట్యాబ్స్ ఫీచర్ ట్యాబ్ బార్ లో ఓ బటన్ లా కనిపిస్తుంది.ఆ బటన్ పై జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు.

టాపిక్, కేటగిరి లేదా రిలయన్స్ ఆధారంగా ట్యాబ్స్ ను గ్రూప్స్ మారుస్తుంది.

Telugu Advanced Ai, Ai, Google Chrome-Technology Telugu

యూజర్లు వాటిని క్లోజ్ చేయవచ్చు లేదంటే ఆ గ్రూప్స్ మధ్య మారొచ్చు.ఈ ఏఐ ఫీచర్ గూగుల్ క్రోమ్ ట్యాబ్స్( AI feature ) ను, వాటిలోని కంటెంట్ను విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ ఆల్ గారి దంపై ఆధారపడి పని చేస్తుంది.మిషన్ లెర్నింగ్ తో అనాలసిస్ చేసిన తర్వాత ట్యాబ్స్ ను గ్రూప్స్ గా క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube