ఆ స్వీట్ షాపుకి ఓ అరుదైన చరిత్ర ఉంది.. అందుకే అక్కడ ఎక్కువ సేల్స్ జరుగుతాయి!

ముఖ్యంగా మన భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో మిఠాయిలు సూపర్ ఫేమస్.ఎందుకంటే మనవాళ్ళు తీపి పదార్ధాలు ఎక్కువగా ఆరగిస్తారు.

 That Sweet Shop Has A Rare History That's Why There Are More Sales, Sweet Shop,-TeluguStop.com

అయితే ప్రాంతాన్ని బట్టి మనం తినే ఆహారపు అలవాట్లలలో వ్యత్యాసాలు ఉంటాయి.కొందరు కారమైన పదార్థాలు ఇష్టపడితే.

మరి కొందరు తీపి పదార్థాలు ఎంతో ఇష్టంగా తింటుంటారు.స్వీట్స్ విషయానికొస్తే కాకినాడ ఖాజా, ఆత్రేయ పురం పూతరేకులు, పుల్లారెడ్డి స్వీట్స్, బండారు లడ్డు, బాదం మిల్క్, రాజమండ్రి వారి రోజ్ మిల్క్ ఇలా ఎన్నో ఆహార పదార్థాలు నోరూరించి లాలాజలం ఊరేలా చేస్తాయి.

అయితే ఇక్కడ అతి కొద్దిమందికి మాత్రమే తెలిసినటువంటి ఓ ఫేమస్ మిఠాయి షాపు గురించి చెప్పుకోవాలి.అది ఆ ప్రాంతంలో సూపర్ ఫేమస్.పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెళ్ళినట్లైతే అక్కడ మనకు ముందుగా గుర్తుకు వెచ్చేది.చేపల పులుసు, అక్కడ దొరికే రకరకాల సీ ఫుడ్స్.

అయితే అదే కాకుండా అక్కడ ఎంతోకాలంనుండి ఆ స్వీట్స్ ఎంతో ఫేమస్.ఆ షాపు పేరు “జై హింద్ స్వీట్ షాప్.” అక్కడ దొరికే మలైకాజా నోరు ఊరిస్తుంది.రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు మెచ్చిన జై హింద్ స్వీట్ స్లాట్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆ మలై కాజా నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి మరీ తింటారు.

అక్కడ ఎన్నిరకాల స్వీట్స్ లభించినప్పటికీ వాటన్నికంటే బాగా ప్రాచుర్యం పొందిందే మలై కాజా.

ఈ మలైకాజా రుచికి సామాన్యులనుండి రాజకీయ నాయకుల వరకు ఫిదా అవ్వాల్సిందే.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటి ప్రముఖులు దీనికి ఫిదా అయ్యారు.

నెల్లూరు వస్తే.తప్పక ఈ కాజాను రుచి చూడాల్సిందే అంటుంటారు మనవాళ్ళు.

మరెందుకాలస్యం.మీరు ఎపుడైనా నెల్లూరు వెల్తేగనుక ఆ కాజాని రుచి చూడకుండా రావద్దు సుమా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube