స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి ( Sai Pallavi )ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సాయిపల్లవి ఏ సినిమాలో నటించిన తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సాయిపల్లవి తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు అద్భుతంగా మాట్లాడగలరు.ఫిదా సినిమా నుంచి తన సినిమాలలో సాయిపల్లవి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.
మరికొన్ని రోజుల్లో అమరన్ సినిమాతో సాయిపల్లవి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమాకు సాయిపల్లవి హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నారు.
ఈ విధంగా తమ సినిమాలకు తామే సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.ఈ విషయంలో సాయిపల్లవిని మెచ్చుకోవాల్సిందే అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సాయిపల్లవి అమరన్ సినిమాతో( movie Amaran ) ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.

సాయిపల్లవి తాజాగా చేసిన కొన్ని కామెంట్లు సైతం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.సాయిపల్లవి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.సాయిపల్లవి లుక్స్ కు సైతం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
వయస్సు పెరుగుతున్నా సాయిపల్లవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

సాయిపల్లవి తండేల్ సినిమాలో ( Tandel movie )ఒక సాంగ్ లో తన డ్యాన్స్ స్పెషల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.రెండు స్క్రిప్ట్ లు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని ఆమె అన్నారు.సాయిపల్లవి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో ఉంది.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సాయిపల్లవి కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఎంతోమందికి ఈ బ్యూటీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.సాయిపల్లవి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.