దేవర మూవీ ( Devara movie )థియేటర్లలో విడుదలై నెల రోజులైంది.నెల రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు.
దేవర మూవీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడాయి.అయితే దేవర తర్వాత రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమా ఏదనే ప్రశ్నకు పుష్ప ది రుల్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.
ఏకంగా ఈ సినిమా 11500 థియేటర్లలో విడుదల కానుంది.
ఆర్.
ఆర్.ఆర్ మూవీ ( RRR movie )కంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం.రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ కోసం ఈ సినిమాను రికార్డ్ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.పుష్ప2 ఫస్ట్ డే కలెక్షన్లు 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి భారీ టికెట్ రేట్లతో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉండగా కల్కి, దేవర సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఎంతో ప్లస్ అయింది.పుష్ప2 సినిమాకు సైతం టికెట్ రేట్ల పెంపు కలిసొచ్చే ఛాన్స్ ఉంది.నాన్ థియేట్రికల్ హక్కులతో ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసిందనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ సినిమాకు పరిస్థితులు సైతం అనుకూలిస్తున్నాయనే సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్ సినిమా రాబోయే రోజుల్లో సంచలన రికార్డులను ఖాతాలో వేసుకోవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.పుష్ప2 సినిమా కథ, కథనంలో ట్విస్టులు వేరే లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ భవిష్యత్తు సినిమాలపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.