రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి.వెంకటయ్యను శుక్రవారం రాత్రి హైదరాబాదులోని ఆయన చాంబర్లో కలిశారు.
ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీ విషయంలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వపరంగా న్యాయం జరిగేటట్టు చూడాలన్నారు.అన్నింటిలో రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలన్నారు.
కలిసిన వారిలో ఎల్లారెడ్డిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి,నాయకులు దయాకర్ రావు,రాజేందర్, బాల్య నాయక్, విఠల్ నాయక్ ఉన్నారు.