తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా ఎప్పటికప్పుడు తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే దానికోసం విపరీతంగా ఎదురుచూసే అభిమానులైతే ఉన్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.
ఇక ఒక్కడు, మురారి, పోకిరి, బిజినెస్ మేన్( Murari, Pokiri, business man ) లాంటి సినిమాలు ఆయన కెరియర్ లో ది బెస్ట్ సినిమాలుగా చెప్పాలి.

ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా సక్సెస్ లను సాధిస్తున్నాయి గాని ఆయనలోని నటన ప్రతిభ బయటికి రావడం లేదంటూ కొంతమంది విమర్శకులు అతన్ని విమర్శిస్తున్నారు.ఇక ఇలాంటి సందర్భంలోనే రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఆయనలో నటన ప్రతిభను బయటకు తీసి ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక మహేష్ బాబు నిజం, వన్ లాంటి సినిమాల్లో మాత్రమే ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

మరి అలాంటి సినిమాలను ఇప్పుడు ఎందుకు చేయడం లేదు.ఆయనలోని నటన ప్రతిభ ఎందుకు బయటకు తీయడం లేదు అంటూ అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మహేష్ బాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఎలాంటి పాత్రలో అయిన నటించగలిగే కెపాసిటీ ఉండి కూడా ఆయన అలాంటి స్క్రిప్ట్ లను ఎంచుకోకపోవడం అనేది నిజంగా మన దురదృష్టం అంటూ మరికొంతమంది అతని విమర్శిస్తున్నారు…చూడాలి మరి ఇక మీదట అయిన అలాంటి మూవీస్ ను చేస్తారా లేదా అనేది…
.