బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది.అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
గతంలో ఒక వారం మాత్రమే హౌస్ లో ఉన్న నయని పావని ( Nayani Pavani )త్వరగానే ఎలిమినేట్ అవుతుందని తెలిసి ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.
నయని పావని , మెహబూబ్ ( Mehboob )ఓటింగ్ పరంగా లీస్ట్ లో ఉన్నారని సమాచారం అందుతోంది.
అయితే నయని పావనికి మరీ తక్కువగా ఓట్లు వచ్చాయని భోగట్టా.నయని పావని చేసిన చిన్నచిన్న తప్పులు ఆమెకు మైనస్ అయ్యాయని తెలుస్తోంది.నయని పావని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడమే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నయని పావనికి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి భారీగానే రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.ఎలిమినేట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తైందని తెలుస్తోంది.నయని పావనికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తాయేమో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ షో సీజన్8 రేటింగ్స్ పరంగా నిరాశ పరుస్తోంది.

బిగ్ బాస్ సీజన్8 రేటింగ్స్ రాబోయే రోజుల్లో పుంజుకుంటాయేమో చూడాలి.గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగినా వివాదం సద్దుమణగడంతో గంగవ్వ ఎలిమినేట్ కాలేదని సమాచారం అందుతోంది.నాగ్ బిగ్ బాస్ షోను సక్సెస్ చేయడానికి తన వంతు కష్టపడుతున్నారు.
బిగ్ బాస్ షోలో కొత్తదనం కొరవడుతోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గత సీజన్ ను సక్సెస్ చేసిన నిర్వాహకులు ఈ సీజన్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.







