మునుగోడు ఉప ఎన్నిక కోసమే 10 లక్షల పెన్షన్లు తీసుకొచ్చారు...డీకే అరుణ

ఆగస్టు 15 ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటారు.జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మాటలను కేసీఆర్ అవమాన పరిచారు కేసీఆర్ లాగా అబద్దాలు చెప్పడం మోడీకి రాదు.

 10 Lakh Pensions Were Brought Only For The By-election Earlier...dk Aruna, Ts P-TeluguStop.com

రాజకీయాలపై తప్పా సంక్షేమం పై కేసీఆర్ కు సోయి ఉండదు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు అబద్ద కోరులు12వందల మంది అమరుల త్యాగాల మీద కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కారుకేసీఆర్ గద్దె దించాలని ప్రజలు చూస్తున్నారు… అది చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు.

తెలంగాణ కు మోడీ ఎందుకు శత్రువు అయ్యారో కేసీఆర్ చెప్పాలి.ప్రాజెక్టుల పేరుతో ఎలా దోచుకుంటున్నారో అందరికి తెలుసు.

కేసీఆర్ చేస్తున్న అవినీతిపై మాట్లాడితే మోడీ శత్రువు అయితారా.పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను మోడీ అడ్డుకుంటున్నారండం సిగ్గు చేటు… పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు ఎప్పుడు సరైన నిధులు కేటాయించలేదు.

ఎపి సీఎం జగన్ తో ఏమి ఒప్పందం చేసుకున్నావు.జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డికి సీఎం కేసీఆర్ అమ్ముడు పోయాడు కేసీఆర్ అసమ్మతి కారానంగానే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు.కోటి ఏరాలకు నీళ్లు ఇస్తున్నామని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు.24 గంటలు కరెంటు ఎక్కడ ఇస్తున్నావో చెప్పు….నాతో రా మెహబూబ్ నగర్ లో ఎక్కడ ఇస్తున్నారో చూపించండి.

లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నీళ్ల పాలు అయ్యింది.లక్షల కోట్లు కమీషన్లు మింగుతూ తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారు.

మోడీ ని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదు.అడ్డగోలుగా వాగితే ఉరుకునేది లేదు….

పాలించే సమర్థత లేకుమాటే దిగిపో.మూడేండ్లలో పూర్తి చేస్తానని చెప్పి ఆరు ఏండ్లు అయినా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడం లేదు.

మునుగోడు ఉప ఎన్నిక కోసమే…10 లక్షల పెన్షన్లు తీసుకొచ్చారు.రాష్ట్రంలో ముందుగా సీఎం గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి.

ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube