2023-2025 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, ఆగస్టు 16న మొదలైంది.ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది అత్యుత్తమ క్రికెట్ జట్లు పోటీ పడుతున్నాయి.
ఈ తొమ్మిది జట్లలో అత్యధిక పాయింట్లు సంపాదించే రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.ఈ ఫైనల్ మ్యాచ్ 2025, జూన్‌లో లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ ( Lord’s Cricket in London )మైదానంలో జరగనుంది.
కానీ ఈ ఫైనల్‌కు టీమ్ ఇండియా అర్హత సాధిస్తుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
ఎందుకంటే టీమిండియా 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఆడిన టెస్ట్ సిరీస్‌లో దారుణంగా ఓడిపోయింది.
బంగ్లాదేశ్‌తో ( Bangladesh )జరిగిన టెస్టు సిరీస్‌లోనే మనోళ్లు ఈసారి కప్ చేజార్చుకునేలాగా బ్యాటింగ్ చేశారు.బ్యాటర్లు తడబడినప్పుడే వీళ్లు ఫైనల్‌కి పోయేలా వేరే అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు.
నిజం చెప్పాలంటే రీసెంట్ టైమ్‌లో టీమిండియా కన్సిస్టెంట్‌గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు.మన ప్లేయర్లు ఎప్పుడు, ఎలా ఆడతారో తెలియని పరిస్థితి నెలకొన్నది.బంగ్లాపై ముప్పుతిప్పలు పడి గెలిచారు కానీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు.
న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఫార్మాట్‌లో ( New Zealand in World Test format )డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్నారు.
వాళ్లు 2023లో డబ్ల్యూటీసీ కచ్చితంగా గెలవాల్సిందే అని మొండి పట్టుదలతో ఆడారు.వీళ్లు తమ ఐపీఎల్ టీమ్‌లో ఉన్న ఇండియన్ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు.
అంటే.ఐపీఎల్ కంటే వరల్డ్ కప్ గెలవడమే వారికి ముఖ్యమని చెప్పకనే చెప్పారు.
అంత ముఖ్యంగా భావించి పట్టుదలతో కృషి చేశారు కాబట్టే టీమ్ ఇండియాను ఫైనల్‌లో ఓడించి విజేతగా నిలిచారు.

ఈసారి కూడా తొలి టెస్టు నుంచే న్యూజిలాండ్ ప్లేయర్లు అదిరిపోయే స్ట్రాటజీతో ఆడుతూ చాలా గేమ్స్ గెలుస్తున్నారు.ఇండియన్ బ్యాటర్లకు ఎలా బంతులు విసరాలో పూర్తి అవగాహన పెంచుకున్నారు.ఆ బ్యాటర్లు మన ప్లేయర్ల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో బాగా స్టడీ చేశారు.
అందుకే వరుసగా రెండు టెస్టుల్లో ఇండియాని చిత్తుగా ఓడించారు.భారత గడ్డపై 12 తర్వాత టెస్టు సిరీస్ గెలిచి తమ సత్తా చాటారు.

ఇక ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వెళ్తుందా లేదా అనేది విశ్లేషిద్దాం.ఈ సీజన్‌లో టీమిండియా ఆడాల్సిన ఇంకో ఆరు టెస్టులు ఉన్నాయి.ఒక టెస్టులో న్యూజిలాండ్‌తో హోమ్ గ్రౌండ్‌లోనే తలపడాల్సి వస్తుంది.మిగిలిన ఐదు టెస్టులు ఆస్ట్రేలియా మైదానాలపై ఆడాల్సి ఉంటుంది.ఈ ఆరు టెస్టుల్లో కనీసం రెండు టెస్టులు తప్పనిసరిగా గెలవాల్సిందే.అంతేకాదు మిగిలిన నాలుగు టెస్టులు డ్రా చేసుకోవాలి.
అంటే ఈ ఆరు టెస్టుల్లో అసలు ఓడిపోకూడదు.ఒక్క టెస్ట్ ఓడినా సరే ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు దాదాపు శూన్యం అవుతాయి.
ఒకవేళ మిగిలిన మ్యాచ్‌లలో కనీసం ఐదు విన్ అయితే ఇండియా టాప్ పొజిషన్‌కు వెళ్ళిపోతుంది.ఫైనల్స్‌కు అర్హత సాధించలేక పోతే ఆసిస్, శ్రీలంక లేదా కివిస్ టోర్నమెంట్ గెలవచ్చు.
సొంత గడ్డపైనే టీమిండియా గెలవలేకపోయింది.ఇక ఆసీస్‌ను వారి సొంత దేశంలోనే ఓడించడం ఇండియాకు ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు.