టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram )ఒకరు.“క” సినిమాతో కిరణ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా “క”( ka movie ) లాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదని వచ్చిందని ప్రూవ్ చేస్తే తాను సినిమాలు చేయడం ఆపేస్తానని తెలిపారు.
టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమా చేసిందని ఈ సినిమాలో తాను పోషించిన వాసుదేవ్ పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
ఈ సినిమా పూర్తిగా కంటెంట్ పై నడిచే సినిమా అని మూవీ పూర్తయ్యే సమయానికి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారని కిరణ్ అబ్బవరం అన్నారు.సినిమాలో ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

వాసుదేవ్ ( Vasudev )అనే వ్యక్తి ప్రయాణం ఈ సినిమా అని కిరణ్ అబ్బవరం తెలిపారు.సినిమాలో నైట్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని ఈ సినిమా సస్ప్సెన్స్ థ్రిల్లర్ మాత్రమేనని కిరణ్ అబ్బవరం తెలిపారు.ఈ సినిమాలో నేను డ్యూయల్ రోల్ చేయలేదని కిరణ్ అన్నారు.మంచి కంటెంట్ దొరికింది కాబట్టి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.క మూవీ దీపావళికి తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతోందని అన్నారు.

తమిళంలో మాకు థియేటర్లు దొరకలేదని కిరణ్ అబ్బవరం తెలిపారు.మలయాళంలో దుల్కర్ మూవీ ( Dulquer movie )రిలీజ్ అవుతుండటంతో ఆరోజు తమ సినిమాను రిలీజ్ చేయడం లేదని పేర్కొన్నారు.క సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పరిస్థితిని ఉంటుందో తెలియాల్సి ఉంది.
కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.








