మళ్లీ దొరికిపోయిన తమన్.. గాడ్ ఫాదర్ మ్యూజిక్ అక్కడ నుంచి కాపీ కొట్టారంటూ?

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Thaman Copied Bgm From Varun Tej Ghani To Chiranjeevi God Father Details, Thama-TeluguStop.com

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.తాజాగా ఈ గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ తాజాగా విడుదల కావడంతో మెగాస్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ఈ టీజర్ లో కొన్ని ట్రోలింగ్స్ కు గురవుతున్నాయి.

చిరంజీవి కాస్ట్యూమ్స్ డ్రస్సులపై జోకులు వేస్తున్నారు.

చిరంజీవి లుక్కు కూడా అంతగా సెట్ అవ్వలేదు అనే కామెంట్ చేస్తున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టీజర్ చివరిలో కనిపించడంపై విమర్శలను గుప్పిస్తున్నారు.ఇక ఆ టీజర్ లో చిరంజీవి పక్కన ఉండగా సల్మాన్ ఖాన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు.

మీకు పర్ఫెక్ట్ డ్రైవర్ దొరికాడు.అంటూ నాటి హిట్ అండ్ రన్ కేసును గుర్తు చేస్తున్నారు.

ఇది ఒక ఎత్తు అయితే గాడ్ ఫాదర్ టీజర్‌లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అందరినీ ఆలోచింపచేస్తుంది.ఈ టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలోని టైటిల్ సాంగ్‌ను గుర్తు చేసేలా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.

అంతే కాకుండా గని పాట,గాడ్ ఫాదర్ బీజీఎం రెండూ ఒకేలా ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దీనిని పసిగట్టిన నెటిజన్స్ వెంటనే సినిమా టీజర్ పై ట్రోల్లింగ్ చేయడం మొదలుపెట్టారు.తమన్ చిరంజీవి సినిమాకె ఇలా పని చేస్తుంటే, మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలే ఇప్పుడు తమన్ మంచి ఫాంలో ఉన్నాడని, అందరూ నెత్తిన పెట్టుకుంటున్నారు.

కానీ ఇప్పుడు ఇలా గాడ్ ఫాదర్ సినిమా బీజీఎంతో అడ్డంగా దొరికిపోయాడు.మరి దీన్ని సినిమాలో ఇలానే ఉంచేస్తారా? తప్పుని గుర్తించి బీజీఎం మార్చుకుంటారా? అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube