సెప్టెంబర్ నెలలో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల.. ఎన్ని హిట్ అవుతాయో?

తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదలవుతున్న సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ను సాధిస్తున్నాయి.పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తున్నాయి.

 9 Tollywood Movies Coming Out September 2022, Vaibhavanga Movie, Gurthunda Seeth-TeluguStop.com

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి నెలకొంది.తలా ఇప్పటికే ఈ ఏడాది మోస్తారు సినిమాలు విడుదల కాగా ఇంకా విడుదల కావాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

అయితే మొన్నటి వరకు ప్రేక్షకులు కేవలం పాన్ ఇండియా సినిమాలను మాత్రమే ఆదరిస్తారు అని భావించారు.ఆ తర్వాత ప్రేక్షకులు రావడం మానేశారు అని దిగులు చెందారు.

కానీ సినిమాలో కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆదరిస్తాయి అని ఇటీవల విడుదలైన సీతారామం, బింపిసార, కార్తికేయ 2 సినిమాలు నిరూపించాయి.ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ లో చిన్న చిన్న సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదల కానున్నాయి.

సెప్టెంబర్ 2వ తేదీన మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా సినిమా విడుదల కానుంది.ఇక సెప్టెంబర్ 9వ తేదీన సత్యదేవ్, తమన్నా లు నటించిన గుర్తుందా సీతా కాలం అనే సినిమా విడుదల కానుంది.

ఇదే రోజున కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడినిసినిమా కూడా విడుదల కానుంది.

Telugu Nenumeeku, Tollywood, Vaibhavanga-Movie

అలాగే హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం కూడా 9న ప్రేక్షకులు ముందుకు రానుంది.కాగా ఈ మూడు సినిమాల పై మంచి బజ్ ఉంది.సెప్టెంబర్ మూడవ వారంలో నిఖిల్ నటించిన 18 పేజెస్ సినిమా విడుదల కానుంది.

అలాగే సెప్టెంబర్ 16వ తేదీన శాకిని డాకినీ సినిమా కూడా విడుదల కానుంది.ఈ సినిమాకు పోటీగా సెప్టెంబర్ 16 న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా విడుదల కానుంది.

సెప్టెంబర్ 23న కృష్ణవిందా విహారి సినిమా విడుదల కానుంది.మరి ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్ గా నిలుస్తాయో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube