గ్రాండ్ లెవల్లో 'లియో' సక్సెస్ మీట్.. ఈసారైనా అడ్డంకులు తొలగేనా?

స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) దసరా బరిలో తన సినిమాను నిలిపిన విషయం తెలిసిందే.ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో’ ( LEO ).

 Thalapathy Vijay Leo Success Event In Nehru Indoor Stadium On This Date Details,-TeluguStop.com

ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూడగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రిలీజ్ రోజు ఈ సినిమాకు మిశ్రమ టాక్ రావడంతో ప్లాప్ అవుతుందేమో అనుకున్నారు.కానీ దసరా సెలవలు కావడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది.

లియో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగానే రాబట్టినట్టు తెలుస్తుంది.

Telugu Chennaiindoor, Trisha, Leo Meet, Vijaythalapathy-Movie

ఇదిలా ఉండగా తాజాగా మేకర్స్ ఈ సినిమా సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు మేకర్స్ ఈ సినిమా విషయంలో ఎలాంటి ఈవెంట్ ను ప్లాన్ చేయలేదు.రిలీజ్ ముందు గ్రాండ్ ఆడియో లాంచ్ ఏర్పాటు చేసిన అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

మరి చెన్నయ్ ఇండోర్ స్టేడియంలో ఆడియో లాంచ్ ప్లాన్ చేయగా అప్పుడు క్యాన్సిల్ అయ్యింది.

Telugu Chennaiindoor, Trisha, Leo Meet, Vijaythalapathy-Movie

కానీ ఇప్పుడు అదే ప్లేస్ లో నవంబర్ 1న లియో సక్సెస్ మీట్ ను( Leo Success Meet ) ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే మేకర్స్ పర్మిషన్ కూడా తీసుకున్నారని అదే స్టేడియంలో గ్రాండ్ లెవల్లో ఈ సినిమా సక్సెస్ మీట్ జరగబోతున్నట్టు తెలుస్తుంది.మరి ఈసారైనా సవ్యంగా జరుగుతుందో లేదో.

  ఈ ఈవెంట్ పై అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

కాగా ‘లియో’ ( LEO )సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటించింది.

సంజయ్ సత్, గౌతమ్ మీనన్, అర్జున్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube