అమెరికాలో దోపిడిలు అంటే ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే.తమకు కావల్సిన దాని కోసం దొంగలు ఎదుటివారిని చంపైనా దానిని దోచుకెళ్తారు.
అందుకే ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా దొంగలకు లొంగిపోతుంటారు కొందరు.అయితే తన ఇంటిలో దొంగతనానికి వచ్చిన ముగ్గురు దొంగలను టెక్సాస్‌లో ఓ వ్యక్తి కాల్చిచంపాడు.
హారిస్ కౌంటీ షెరిఫ్ ఎడ్ గొంజాలెజ్ తెలిపిన వివరాల ప్రకారం నల్లటి దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఛానల్ వ్యూ 1800 బ్లాక్ లోని ఓ ఇంట్లోకి చొరబడ్డారు.వీరిని చూసి ఆ ఇంటిలోని ఓ వ్యక్తి దాక్కున్నాడు.
కానీ రెండో వ్యక్తి మాత్రం షాట్‌గన్‌తో బయటకి వచ్చి కాల్పులు జరుపుతూ దుండగులను ఎదుర్కొన్నాడు.
ఈ ఘటనలో ముగ్గురు దుండగులు అక్కడికక్కడే మరణించగా, కాల్పులు జరిపిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.మరణించిన ముగ్గురు దోపిడికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఛానల్ వ్యూ హ్యుస్టన్‌కు తూర్పున కేవలం 15 మైళ్ల దూరంలోనే ఉంది
.