ప్రస్తుత సమాజంలో చిన్న, పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా లైగిక దాడులు జరుగుతున్నాయి.తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాలు కలిగిన బాలుడిపై ఏకంగా ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో ఓ దంపతులకి 13 సంవత్సరాలు ఉన్నటువంటి కొడుకు ఉన్నాడు.ఈ దంపతులు ఇద్దరూ పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.అయితే ఇది ఇలా ఉండగా ఈ నెల 18వ తారీఖున ఇంట్లో వారందరూ పని నిమిత్తమై బయటికి వెళ్లారు.దీంతో బాలుడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు.
ఇది గమనించిన నిందితులు బాలుడుని క్రికెట్ ఆడుకుందాం రమ్మని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు.అనంతరం ఒకరు తరువాత ఒకరు ఆరుగురు వ్యక్తులు బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేగాక ఈ విషయం గూర్చి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.దీంతో బాలుడు ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాడు.
అయితే పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలుడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది.దాంతో వారు ఏమైందని బాలుడిని అడగ్గా తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలియజేశాడు.అంతేగాక ఆరుగురు వ్యక్తులు తనపై గతః ఏడూ నెలలుగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపాడు.దీంతో బాలుడు తల్లిదండ్రులు దగ్గర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుడి తండ్రి తెలిపిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిన్నటి రోజున ఆ ఆరుగురు కామందులను అరెస్ట్ చేశారు.ఆలాగే ఇందులో ఐదుగురు మైనర్ బాలురు ఉండటంతో వారిని ప్రభుత్వ జువైనల్ హోమ్ కి తరలించారు.
మరో నవీన్ అనే నిందితుడి ని రిమాండ్ కి తరలించారు.