సికింద్రాబాద్ కంటోన్మెంట్( Secunderabad Cantonment ) నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత( Nivedita ) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు ఆమె నివాసం వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బాధితులు నిరసనకు దిగారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను( Double Bedroom Houses ) ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబం తమను మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.కూతుళ్ల సమక్షంలోనే సాయన్నకు డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు.
డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తామని తమ వద్ద రూ.కోటిన్నర తీసుకున్నారని ఆరోపించారు.ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదంటున్న బాధితులు తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.