కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత..!

సికింద్రాబాద్ కంటోన్మెంట్( Secunderabad Cantonment ) నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత( Nivedita ) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ మేరకు ఆమె నివాసం వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బాధితులు నిరసనకు దిగారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను( Double Bedroom Houses ) ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబం తమను మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

కూతుళ్ల సమక్షంలోనే సాయన్నకు డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు. """/" / డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తామని తమ వద్ద రూ.

కోటిన్నర తీసుకున్నారని ఆరోపించారు.ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదంటున్న బాధితులు తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.