తెలంగాణ కొత్త డీజీపీ రవి గుప్తా..!!

తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను ఎలక్షన్ కమిషన్ నియమించింది.ఓట్ల లెక్కింపు పూర్తవ్వకముందే రేవంత్ రెడ్డిని అంజనీకుమార్ కలవటంతో ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడం తెలిసిందే.

కౌంటింగ్ ముగియకముందే కలవటాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని ఈసీ భావించడం జరిగింది.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలవడం జరిగింది.

యూపీఏ హయాంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం జరిగింది.

కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది.కానీ ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.దీంతో టీకాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి… ఎవరు అధిరోహిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.చాలావరకు రేవంత్ రెడ్డి పేరు వినపడుతోంది.సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకుని.ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం లోపు తేల్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో.నిర్లక్ష్యం వహించిన చాలామంది అధికారులను ఈసీ సస్పెండ్ చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఏకంగా డీజీపీని సస్పెండ్ చేయటం.తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube