తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర( Medaram Maha Jathara )కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) వెళ్లారు.ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి అర్జున్ ముండాకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు స్వాగతం పలికారు.
తరువాత సమ్మక్క – సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై మొక్కులు చెల్లించారు.కాగా గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి.ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.ఈ క్రమంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.అలాగే ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మేడారానికి వెళ్లి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.