తెలంగాణలో త్వరలో ఎన్నికల రానున్న నేపథ్యంలో విపక్ష పార్టీ బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.అసెంబ్లీ ఎన్నికలే ఎజెండాగా బీజేపీ మిషన్ 90ని చేపట్టనుంది.
రాష్ట్రంలో 90 స్థానాలు లక్ష్యంగా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.అదేవిధంగా ఏడాదిపాటు ఎన్నికల క్యాలెండర్ ను కూడా విడుదల చేయాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అసెంబ్లీ ఇంఛార్జ్ లతో జాతీయ నేత బీఎల్ సంతోష్ సమావేశం కానున్నారు.45 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు ప్రారంభించారు.బలహీనంగా ఉన్న 45 స్థానాల్లో బలమైన అభ్యర్థులను చూడాలని చేరికల కమిటీకి ఇప్పటికే ఆదేశాలు అందాయి.