తుని టికెట్ విషయంలో ఆడియో టేప్ వైరల్ కావడంపై టీడీపీ నేత యనమల కృష్ణుడు స్పందించారు.తన మాట్లాడిన ఆడియోను కొన్ని పార్టీలు కావాలనే వక్రీకరించాయని చెప్పారు.
తమ అన్నదమ్ములది ఎప్పటికీ ఒకే మాట, ఒకే బాట అని తెలిపారు.అయితే తుని టీడీపీ టికెట్ ను యనమల రామకృష్ణుడు తన కుమార్తెకు ఇస్తున్నారని, దానిపై ఆయన సోదరుడు యనమల కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆయన టీడీపీ నేతతో మాట్లాడిన ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.