నోటిఫికేషన్ తర్వాత చంద్రబాబు కు గట్టి దెబ్బ ! వైసీపీలోకి తోట నరసింహం!  

టిడిపిని వీడి వైసీపీలో చేరబోతున్న కాకినాడ ఎంపీ తోట నరసింహం..

  • తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తోట నరసింహం తాజాగా చంద్రబాబు కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని తోట నరసింహం కి చంద్రబాబు ఆ రకమైన హామీ ఇవ్వడంతో పాటు, మళ్లీ ఎంపీగానే నిలబడాలని సూచించడంతో తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వైసీపీ పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉన్న తోటకి జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • అతి సారి ఎన్నికల్లో తన స్థానంలో తన భార్య వాణిని ఎమ్మెల్యేగా బరిలో దించుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీ నుంచి కాకినాడ రూరల్ లేదా సిటీని తోట నరసింహం భార్యకు కేటాయించేందుకు వైసీపీ నుంచి హామీ రావడంతో ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.