మనిషి చనిపోయి మూడు రోజులైనా ట్రీట్మెంట్ అందించిన హాస్పటల్.. ఠాగూర్ సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన..

ఠాగూర్ సినిమాలో హైలెట్ సీన్ గుర్తుంది కదా.అదేనండి చనిపోయిన వ్యక్తిని హాస్పటల్ కి తీసుకొస్తే ఆ హాస్పటల్ యాజమాన్యం అతడికి ట్రీట్మెంట్ ఇస్తున్నామంటూ చేసే ఓవర్ యాక్షన్,డాక్టర్ ఓవర్ యాక్షన్ కి పావలా శ్యామల ఇచ్చిన రియాక్షన్స్ మర్చిపోగలమా.

 Tamil Nadu Doctors Treat Dead Body For Three Days To Raise Medical Bill-TeluguStop.com

సీన్ చూస్తున్నంతసేపు నవ్వుతెప్పించినప్పటికి అది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.ప్రస్తుతం హాస్పటల్స్ ధోరణిని బట్టబయలు చేసిన సీన్ అది.అచ్చం సినిమాలో మాదిరిగానే తమిళనాడులో ఒక ఘటన జరిగింది.చనిపోయిన వ్యక్తికి ఓ ఆసుపత్రిలో ఏకంగా మూడు రోజులపాటు వైద్య సేవలు అందించడం సంచలనంగా మారింది.

తమిళనాడు నాగపట్టణం జిల్లాలోని తంజావూర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.తన తండ్రి ఎన్.శేఖర్ చనిపోయి మూడు రోజులైనా వైద్యులు చికిత్స చేశారని, తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగితే ఇంకా వైద్యం చేస్తూనే ఉన్నామని బదులిచ్చారని ఆయన కుమారుడు సుభాష్ తెలిపారు.శేఖర్ అనే వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుంటే,శేఖర్ కొడుకు సుభాష్ నాగపట్టణంలోని ఆసుపత్రిలో చేరారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అక్కడి నుంచి తంజావూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేశారు.శేఖరును అక్కడికి తరలించారు.హాస్పటల్లో జాయిన్ చేసుకోవడానికి ముందే ఐదు లక్షలు కట్టాలని , రూ.5 లక్షలు కట్టించుకుంది ప్రైవేట్ హాస్పటల్ యాజమాన్యం.చికిత్స కొనసాగించేందుకు మరో రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా సుభాష్ ని కోరింది.

అప్పటికే ఉన్న డబ్బులన్ని కట్టేశాం.ఇంక మూడు లక్షలు కట్టలేమని ఇంతవరకు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది కదా.మిగతాది ప్రభుత్వ హాస్పటల్లో చేయించుకుంటామని తండ్రిని తంజావూర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు.అక్కడికి వెళ్లాక అసలు విషయం బయటపడింది.

అతడిని పరీక్షించిన వైద్యులు ఆయన చనిపోయి మూడు రోజులు అయిందని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు.దీంతో సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శేఖర్ మృతి చెందిన విషయాన్ని చెప్పాల్సింది పోయి ఇంకా ఫీజు అడగడం దారుణం.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వైరల్ కావడంతో.

రోగుల ప్రాణాలు కాపాడాల్సిన హాస్పటల్స్ వారి ప్రాణాలతోనే వ్యాపారం చేయడం ఏంటని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube