ప్రస్తుత కాలంలో కొందరు చట్టం, న్యాయం, ధర్మం, వంటివాటిని పరిరక్షించాల్సిన వాళ్లే అక్రమాలకు పాల్పడుతున్నారు.కాగా తాజాగా న్యాయం చేయమని తన వద్దకు వచ్చిన ఓ మహిళకి మత్తు మందు ఇచ్చి ఆమెపై దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ విషయాన్ని పబ్లిక్ లో పెడతానంటూ బెదిరించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తిరువల్లూరు పరిసర ప్రాంతంలో సావిత్రి (పేరు మార్చాం) అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.సావిత్రి భర్త కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో సావిత్రి భర్త ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు మరియు తరచూ మద్యం సేవించి వచ్చి ఇంట్లో గొడవ పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉండేవాడు.దీంతో సావిత్రి తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో దగ్గరలో ఉన్నటువంటి లాయర్ ని సంప్రదించి తనకు విడాకులు ఇప్పించాలంటూ కోరింది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
అయితే సావిత్రి విడాకుల విషయమై లాయర్ వద్దకు వెళ్లిన సమయంలో క్రిమినల్ లాయర్ ఏకంగా ఆమెకి మత్తుమందు ఇచ్చి దారుణంగా అత్యాచారం చేశాడు.అంతేకాక ఈ విషయాన్ని వీడియోలు కూడా తీశాడు.అనంతరం తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అలా చేయడం వల్ల తమ కుటుంబ పరువు, మర్యాదలు మంటలో కలిసిపోతాయని హెచ్చరించడంతో సావిత్రి కిక్కురుమనకుండా ఉండిపోయింది.అంతేకాకుండా ఆ వీడియోలను బయట పెట్టొద్దని క్రిమినల్ లాయర్ కి దాదాపు “ఏడు లక్షల” రూపాయలకు పైగా డబ్బులు కూడా ఇచ్చింది.
కానీ రోజు రోజుకి క్రిమినల్ లాయర్ ఆగడాలు ఎక్కువవుతుండడంతో చేసేదేమీలేక దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు.