మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత వరుసగా రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా డైరక్షన్ లో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.
ఈ సినిమాతో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా కూడా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది.
ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో నటిస్తాడని అంటున్నారు.ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత మెహెర్ రమేష్ డైరక్షన్ లో చిరు సినిమా ప్లానింగ్ లో ఉంది.
ఇదే కాకుండా టాలీవుడ్ స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లితో కూడా చిరు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
రీసెంట్ గా వంశీ పైడిపల్లి బర్త్ డే సందర్భంగా చిరు స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు.
వంశీ పైడిపల్లి ఇచ్చిన పార్టీలో స్టార్ డైరక్టర్స్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ పార్టీకి చిరు అటెండ్ అవడం హాట్ న్యూస్ గా మారింది.వంశీ పైడిపల్లి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్న వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ సినిమా చిరుతో ప్లాన్ చేస్తున్నాడని టాక్.అందుకే బర్త్ డే పార్టీకి పిలిచి స్టోరీ లైన్ వినిపించాడట.
చిరు కూడా వంశీతో సినిమాకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.మరి చిరుతో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.