విశాఖ రామానాయుడు స్టూడియోపై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

గత కొద్ది రోజులుగా విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో సంబంధించి పలు కథనాలు వినిపిస్తున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ భవనాలకు, అలాగే సీఎం నివాస స్థలం కోసం సరైన ప్రదేశం కోసం వెతుకుతుంది.

 Producer Suresh Babu Gives Clarity On Vizag Ramanaidu Studio, Tollywood, Ysrcp,-TeluguStop.com

ఈ నేపథ్యంలో రుషికొండ సమీపంలో ఉన్న రామానాయుడు స్టూడియోని ముఖ్యమంత్రి నివాస స్థలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.గతంలో ఆ స్థలాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మాత రామానాయుడుకి స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చింది.

ఆ కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని అద్భుతమైన స్టూడియోని రామానాయుడు ఏర్పాటు చేశారు.విశాఖలో చాలావరకు షూటింగ్లు ఈ స్టూడియోలో జరుగుతుండడం విశేషం.

అయితే ఉన్నపలంగా ఇప్పుడు సీఎం నివాస స్థలం కోసం ఈ స్టూడియో ని స్వాధీనం చేసుకోవడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుందని టాక్ బయటకు వచ్చింది.

దీంతో విపక్షాలు కూడా ఈ వార్తలపై వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కథనాలపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు.గతంలో ఏపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోని తమకు ఇవ్వాలని, దాని స్థానంలో భీమిలి సమీపంలో అంతే విస్తీర్ణంలో మరొక స్థలాన్ని ఇస్తామని ప్రపోజల్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఆ ప్రపోజల్ కు తాను అంగీకరించలేదని, తర్వాత వైసిపి ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఏం మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.

Telugu Ap, Suresh Babu, Tollywood, Visakhapatnam, Vizag, Vizagramanaidu, Ysrcp-M

అయితే ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉండడం వల్లనే సురేష్ బాబుకి రామానాయుడు స్టూడియోపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఒకవేళ ఆ స్టూడియో ని మాత్రం స్వాధీనం చేసుకుంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube