సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) ప్రస్తుతం సినిమాల సంఖ్య విషయంలో వేగం తగ్గించారు.రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తూ కెరీర్ విషయంలో మహేష్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే.
అయితే టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో సేవా కార్యక్రమాల విషయంలో మహేష్ బాబు నంబర్ వన్ అని చెప్పవచ్చు.గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమంది చిన్నారులకు మహేష్ ప్రాణం పోశారు.
ఒక్కో హార్ట్ సర్జరీకి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనే సంగతి తెలిసిందే.అయితే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతున్నా ఆ ఖర్చును భరిస్తూ 1000 కంటే ఎక్కువమంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించిన మహేష్ మంచ్ మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
యంగ్ జనరేషన్ హీరోలలో సేవా గుణం ఉన్న నంబర్ వన్ హీరో మహేష్ బాబు అని నెటిజన్లు సైతం అంగీకరిస్తున్నారు.

వేల గుండెలకు ప్రాణం పోసినా చెప్పుకోవడానికి మహేష్ బాబు అస్సలు ఇష్టపడరనే సంగతి తెలిసిందే.సినిమాల విషయంలో మహేష్ బాబు రూటే సపరేట్ అని చెప్పవచ్చు.దర్శకుల ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా కథ నచ్చితే ఛాన్స్ ఇచ్చే విషయంలో మహేష్ ముందువరసలో ఉంటారు.
లేడీస్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ హీరో క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నారు.
మహేష్ లాంటి రియల్ హీరోలు అరుదుగా ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.జక్కన్న( Rajamouli ) డైరెక్షన్ లో నటించే సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో మహేష్ పారితోషికం( Remuneration ) తీసుకుంటున్నారు.
వివాదాలకు మహేష్ దూరంగా ఉంటున్నారు.మహేష్ కు మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.