ఆ రీజన్ వల్లే రమేష్ బాబుకు సినిమాలపై ఆసక్తి పోయింది.. కృష్ణ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నారు.తండ్రికి మించి తనయునిగా మహేష్ గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు ప్రస్తుతం మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు.

 Super Star Krishna Comments About Mahesh Babu And Ramesh Babu , Ramhesh Babu, N-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబు స్టార్ హీరో అవుతాడని తాను ఎప్పుడో ఊహించానని కృష్ణ చెప్పుకొచ్చారు.

పోరాటం అనే మూవీలో తన కొడుకులు మహేష్ బాబుతో పాటు రమేష్ బాబు కూడా నటించారని కృష్ణ అన్నారు.ఆ సినిమా తర్వాత రమేష్ బాబు నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదని కృష్ణ వెల్లడించారు.

ఆ రీజన్ వల్లే రమేష్ బాబుకు సినిమాల విషయంలో ఆసక్తి తగ్గిందని కృష్ణ తెలిపారు.

తన కొడుకు మహేష్ బాబు సినిమాలతో పాటు బిజినెస్ వ్యవహారాలను పట్టించుకుంటాడని కృష్ణ అన్నారు.

కోడలు నమ్రత సినిమాలు, బిజినెస్ వ్యవహారాలను పట్టించుకోదని కృష్ణ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు సినిమాల విషయంలో నమ్రత జోక్యం ఉంటుందని జరిగిన ప్రచారానికి ఈ విధంగా కృష్ణ చెక్ పెట్టారు.

బ్యాడ్ సబ్జెక్ట్స్ పడకపోతే రమేష్ బాబు కెరీర్ ను కొనసాగించే వారని కృష్ణ తెలిపారు.

Telugu Mahesh Babu, Namrata, Ramesh Babu, Krishna-Movie

రమేష్ బాబుకు పబ్లిక్ లోకి రావడం పెద్దగా ఇష్టం ఉండదని కృష్ణ చెప్పుకొచ్చారు.నమ్రత హౌస్ వైఫ్ మాత్రమే ఉంటుందని తన పిల్లలను చూసుకోవడానికి మాత్రమే నమ్రత ప్రాధాన్యత ఇస్తారని కృష్ణ పేర్కొన్నారు.మామా కోడళ్ల మధ్య అనుబంధం బాగుంటుందని నమ్రత కూతురులా కలిసిపోతుందని కృష్ణ తెలిపారు.

కృష్ణ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube