సినిమా నటీనటులకు సంబంధించిన పలు వార్తలు క్షణాల్లోనే వైరల్ అవుతాయి.అవి నిజమా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు చాలా మంది.ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.వాస్తవమే అని నమ్మి.వాటిని ఓ రేంజిలో షేర్ చేస్తారు.చివరకు ఆ వార్తలు వాస్తవం కాదు అని.సదరు హీరోలు, లేదా హీరోయిన్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి.
తాజాగా ఇలాంటి విషయమే మరొకటి జరిగింది.దాని గురించి సదరు హీరో ఎంటర్ కావాల్సి వచ్చింది.
ఆ వార్తల్లో వాస్తవం లేదు అని చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఆ వార్తలు వచ్చింది ఎవరి మీదో కాదు.
సీనియర్ హీరో సుమన్ గురించి.ఇండియన్ ఆర్మీకి సుమన్ 117 ఎకరాల ల్యాండ్ ను విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
అయితే వాస్తవానికి ఈ వార్తలు అవాస్తవం.సుమన్ భారత రక్షణ దళానికి ఎలాంటి విరాళం ఇవ్వలేదు.
అంతేకాదు.ఈ భూమిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విరాళం అందిచినట్లు వచ్చాయి.
అయితే ఈ వార్తలు వాస్తవం కాదని ఆయన స్వయంగా వెల్లడించాడు.
ఈ వార్తల గురించి ఆయన మీడియాతో మాట్లాడాడు.సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పాడు.వాటిని ఎవరూ నమ్మొద్దని కోరాడు.
ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతోందని వెల్లడించాడు.వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తి గతంగా తానే స్వయంగా వివరాలు మీడియా ద్వారా వెల్లడిస్తానన్నాడు.
దానికి సంబంధించి ఏ విషయమైనా తాను ప్రకటించే వరకు ఎవరూ మాట్లాడ కూడదని కోరారు.మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇప్పటికి అవాస్తవం అని వెల్లడి అయ్యింది.
సుమన్ చెప్పడం మూలంగానే ఈ విషయం బయటకు తెలిసింది.