ఆ భూమి నేను ఎవ్వరికి దానం చేయలేదు : సుమన్

సినిమా నటీనటులకు సంబంధించిన పలు వార్తలు క్షణాల్లోనే వైరల్ అవుతాయి.అవి నిజమా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు చాలా మంది.

ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.వాస్తవమే అని నమ్మి.

వాటిని ఓ రేంజిలో షేర్ చేస్తారు.చివరకు ఆ వార్తలు వాస్తవం కాదు అని.

సదరు హీరోలు, లేదా హీరోయిన్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి.

తాజాగా ఇలాంటి విషయమే మరొకటి జరిగింది.దాని గురించి సదరు హీరో ఎంటర్ కావాల్సి వచ్చింది.

ఆ వార్తల్లో వాస్తవం లేదు అని చెప్పుకోవాల్సి వచ్చింది.ఇంతకీ ఆ వార్తలు వచ్చింది ఎవరి మీదో కాదు.

సీనియర్ హీరో సుమన్ గురించి.ఇండియన్ ఆర్మీకి సుమన్ 117 ఎకరాల ల్యాండ్ ను విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

అయితే వాస్తవానికి ఈ వార్తలు అవాస్తవం.సుమన్ భారత రక్షణ దళానికి ఎలాంటి విరాళం ఇవ్వలేదు.

అంతేకాదు.ఈ భూమిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విరాళం అందిచినట్లు వచ్చాయి.

అయితే ఈ వార్తలు వాస్తవం కాదని ఆయన స్వయంగా వెల్లడించాడు. """/"/ ఈ వార్తల గురించి ఆయన మీడియాతో మాట్లాడాడు.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పాడు.

వాటిని ఎవరూ నమ్మొద్దని కోరాడు.ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతోందని వెల్లడించాడు.

వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తి గతంగా తానే స్వయంగా వివరాలు మీడియా ద్వారా వెల్లడిస్తానన్నాడు.

దానికి సంబంధించి ఏ విషయమైనా తాను ప్రకటించే వరకు ఎవరూ మాట్లాడ కూడదని కోరారు.

మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇప్పటికి అవాస్తవం అని వెల్లడి అయ్యింది.

సుమన్ చెప్పడం మూలంగానే ఈ విషయం బయటకు తెలిసింది.

వర్మకి రెండో భార్య పవన్..: పోతిన మహేశ్