నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీటీసీ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.బలవన్మరణం చెందేందుకు దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కారు.
తమ భూమిపై గ్రామంలోని కొంతమంది వ్యక్తులు, సమస్యలు సృష్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పోలీసుల హామీతో రవి దంపతులు వాటర్ ట్యాంక్ దిగి కిందకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.