జైలులో చదువుకుని గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఒకసారి జైలుకు( Prison ) వెళితే జీవితం ముగిసిపోయినట్టేనని చాలామంది భావిస్తారు.జైలుశిక్ష అనుభవించే వాళ్లు కుంగుబాటుకు లోను కావడంతో పాటు కెరీర్ పరంగా ముందడుగులు వేయడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

 Studying From Prison Winning Gold Medal Mohammed Rafi Success Story Details, Moh-TeluguStop.com

అయితే నంద్యాల జిల్లా( Nandyala District ) సంజామల మండలం పేరు సోముల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ( Mohammed Rafi ) ఒకవైపు జైలు శిక్షను అనుభవిస్తూనే మరోవైపు దూరవిద్య ద్వారా చదువుకుని పీజీ సోషియాలజీలో స్వర్ణ పతకాన్ని( Gold Medal ) అందుకోవడం గమనార్హం.

ఒక కేసులో కొన్నేళ్ల క్రితం ముద్దాయిగా ప్రూవ్ కావడంతో రఫీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

హైదరాబాద్ నుంచి పీజీ సోషియాలజీలో( PG Sociology ) ఎక్కువ మార్కులతో బంగారు పతకం సాధించిన రఫీ తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు. 4 రోజుల బెయిల్ పై హైదరాబాద్ కు వెళ్లి రఫీ యూనివర్సిటీ వీసీ చేత బంగారు పతకాన్ని అందుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Kadapacentral, Mohammed Rafi, Mohammedrafi, Nandyala, Pg Sociology, Story

రఫి ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో( Kadapa Central Prison ) జీవితఖైదు అనుభవిస్తున్నాడు.తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్ ను రఫీ సాధించారు.ఎం.ఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందిన రఫీ చదువుపై ఉన్న మమకారంతో తాను పీజీ సాధించానని రఫీ తెలిపారు.నేను సాధించిన గోల్డ్ మెడల్ ను నా పేరెంట్స్ కు అంకితం ఇస్తానని రఫీ కామెంట్లు చేశారు.రఫీ మంచి ఉద్యోగం సాధించి కెరీర్ పరంగా ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Telugu Kadapacentral, Mohammed Rafi, Mohammedrafi, Nandyala, Pg Sociology, Story

మహమ్మద్ రఫీ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహమ్మద్ రఫీ టాలెంట్ తో అంతకంతకూ ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.మహమ్మద్ రఫీ జైలు నుంచి త్వరగా విడుదలైతే బాగుంటుందని అతని కెరీర్ కు ప్రయోజనం చేకూరుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహమ్మద్ రఫీ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube