ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్యపరమైన గొడవలు, భద్రతా సమస్యల కారణంగా భారతీయ విద్యార్థులు కెనడా ( Canada )ప్రణాళికలను మరోసారి సమీక్షించుకుంటున్నారు.భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే.
భద్రత గురించి ఆందోళనల కారణంగా కెనడాలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

కొంతమంది విద్యార్థులు తమ అడ్మిషన్‌ను తర్వాత కాలానికి వాయిదా వేస్తున్నారు, మరికొందరు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్( United States, United Kingdom ), ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలలో చదువుకోవడానికి ఎంచుకుంటున్నారు.ఎందుకంటే ఈ దేశంలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది.ఈ ఆరు దేశాలలో ఇంగ్లీష్ మాట్లాడుతారు.
అందువల్ల కమ్యూనికేషన్ సమస్య ఉండదు. క్లాస్‌మేట్స్, ప్రొఫెసర్స్( Classmates, professors ) బయట వ్యక్తులతో ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడుకోవచ్చు.
భద్రతా సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి.ఈ దేశాల్లో భారతీయులు అధికంగా ఉంటారు కాబట్టి ఒక కమ్యూనిటీలా సేఫ్ గా ఉండవచ్చు.
ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

మరోవైపు కెనడాలోని భారతీయ విద్యార్థులు కూడా ఇళ్లు, ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.కొంతమంది విద్యార్థులు తమ యూనివర్సిటీల వెలుపల క్యాంప్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే వారికి నివసించడానికి స్థలం దొరకదు.కెనడాకు బదులుగా పైన పేర్కొన్న ఆరు దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఆల్టర్నేటివ్స్ గా నిలుస్తున్నాయి.
ఇకపోతే తక్కువ మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వస్తే, అది కెనడా ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుంది.అంతర్జాతీయ విద్యార్థులు ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి $30 బిలియన్ల విరాళాన్ని అందిస్తారు.
దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్, గిగ్ ఎకానమీకి మద్దతు ఇవ్వడంలో సహాయపడతారు.