సాధారణంగా స్ట్రీట్ ఫుడ్( Street Food ) ఆహార ప్రియుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.అయినా కస్టమర్ల కోసం ఇంకేదైనా మంచిగా చేయాలని వీధి వ్యాపారులు ఎల్లప్పుడూ అనుకుంటారు.
చాలా మంది వారి రోజువారీ సంపాదనపై దృష్టి పెడతారు.కానీ కొందరు మాత్రం కస్టమర్లకు స్పెషల్ కస్టమర్ సర్వీస్( Special Customer Service ) అందించాలి అనుకుంటారు.
తాజాగా అలాంటి స్ట్రీట్ వెండార్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.ఈ అసాధారణమైన స్ట్రీట్ ఫుడ్ విక్రేత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఈ వ్యాపారి ఫన్నీ, కేరింగ్ నేచర్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.అజయ్( Ajay ) అనే కంటెంట్ క్రియేటర్ రూపొందించిన ఈ వీడియో సాధారణ ఫుడ్ బ్లాగ్ లాగా ప్రారంభమవుతుంది, కానీ ‘చోలే కుల్చా’( Chole Kulcha ) అనే ఫుడ్ అందించినప్పుడు ఊహించని మలుపు తిరుగుతుంది.కస్టమర్ ఒక ప్లేట్‌ను ఆర్డర్ చేస్తాడు, విక్రేత అతనికి సేవ చేస్తానని చెప్పి అతన్ని కూర్చోమని ఆహ్వానిస్తాడు.ఆ తర్వాత విక్రేత ఒక చెట్టు కింద కస్టమర్‌ను కూర్చోబెడతాడు.
ఆపై కస్టమర్‌కు తన చేతితో ఫుడ్ తినిపిస్తూ కనిపిస్తాడు, అంటే తల్లి కుమారుడికి గోరు ముద్దలు తినిపించిన మాదిరి ఈ వ్యాపారి కస్టమర్‌కు ఫుడ్ తినిపిస్తాడు.ఆహారం బాగానే ఉందా, కొంచెం రైతా తీసుకురావాలా అని అడుగుతాడు.
వీడియోకు “మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్” అనే క్యాప్షన్ యాడ్ చేశారు.ఈ వీడియో 2 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది.నెటిజన్లు ఆ వీధి వ్యాపారి కేరింగ్ విధానం పట్ల ప్రశంసలు కురిపించారు.చాలా మంది వ్యూయర్స్ ఈ వీడియో హార్ట్ టచింగ్‌గా ఉందని అన్నారు, విక్రేత ఆరోగ్యకరమైన స్వభావాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు.