రంగుల పండుగ హోలీ వచ్చేసింది.ప్రజలు ఈ ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం ఆల్రెడీ మొదలు పెట్టేసారు.
ఇక కంటెంట్ క్రియేటర్స్ రకరకాల స్టంట్స్ చేస్తూ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు.ఆ వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు.
తాజాగా ఒక మహిళ కూడా హోలీ పండుగను పురస్కరించుకొని స్టంట్ చేసింది కానీ అది అనుకున్న విధంగా జరగలేదు.బెడిసికొట్టిన ఈ స్టంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో మహిళ చీరకు మంటలు అంటుకోవడం మనం చూడవచ్చు.ప్రమాదకర సంఘటనను చూపుతుంది.కంటెంట్ క్రియేటర్స్ తరచుగా వీడియోలను తయారు చేస్తారు, కొన్నిసార్లు ఈ విన్యాసాలు వారిని ప్రమాదాల్లో పడేయవచ్చు.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని మహిళకు కూడా ఇదే జరిగింది.ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.2 లక్షల దాక లైక్స్ వచ్చాయి.వీడియోలో యెల్లో కలర్ శారీ వేసుకున్న మహిళ జిమ్నాస్టిక్స్ చేస్తుండటం మనం చూడవచ్చు.ఆమె తన బూట్లకు పటాకులు తగిలించి ఒక ఇనుప స్తంభం ఎక్కి స్టంట్స్ చేస్తుంది.
ఆ ఫైర్ క్రాకర్స్ నుంచి వెలువడే పొగతో ఒక గుండ్రటి సర్కిల్ క్రియేట్ చేద్దామని ట్రై చేసింది.దానికోసం ఇనుప కడ్డీ పట్టుకుని చుట్టూ తిరిగింది.
దురదృష్టవశాత్తు, పటాకుల నుంచి వచ్చిన నిప్పురవ్వలు ఆమె చీరకు నిప్పంటించాయి.అది గమనించిన సదరు మహిళ వెంటనే కిందకు దిగి పటాకులు తొలగించడానికి ప్రయత్నిస్తుంది.సమీపంలోని ప్రజలు బాణాసంచాని కాళ్లతో తొక్కుతూ ఆర్పి వేయడానికి ప్రయత్నించారు.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు స్టంట్ ప్రమాదకరమైనదని, తెలివితక్కువదని కామెంట్లు చేశారు.“దయచేసి జాగ్రత్త వహించండి, రిస్క్ తీసుకోకండి” వంటి హెచ్చరికలు చేశారు.
జిమ్నాస్ట్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ “బి కేర్ ఫుల్ డియర్” అంటూ సలహా ఇచ్చారు.కొందరు వీడియోను మెచ్చుకున్నారు కానీ భద్రతా చర్యలు లేకుండా ఇలాంటి స్టంట్స్ సెట్ చేయడం తెలివి తక్కువతనమని అన్నారు.మరికొందరు కేవలం వీడియో కోసం తీసుకున్న తీవ్ర నష్టాలను విమర్శిస్తున్నారు.
భద్రత ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని ఒక వ్యాఖ్య నొక్కి చెప్పారు.