నేటి ఆధునిక కాలంలో కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు.వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఓవర్ వెయిట్ కారణంగా సఫర్ అవుతున్నారు.
అధిక బరువు వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే గ్రీన్ టీ మరియు బ్లాక్ కాఫీ బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన పానీయాలు.ఇవి రెండు తక్కువ కేలరీలు మరియు ఎక్కువ ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి.
అందుకే చాలా మంది తమ వెయిట్ లాస్ జర్నీ గ్రీన్ టీ ( Green tea)లేదా బ్లాక్ కాఫీని భాగం చేసుకుంటారు.అయితే ఈ రెండు పానియాల్లో వెయిట్ లాస్ ఏది బెస్ట్.? దీనికి మొదటి ప్రధాన్యత ఇవ్వాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.బ్లాక్ కాఫీ( Black coffee ) ఇది సాంప్రదాయ కాఫీకి ఆరోగ్యకరమైన వెర్షన్.
బ్లాక్ కాఫీలో చక్కెర, మిల్క్ ఉండవు.అందువల్ల ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ చాలా మేలు చేస్తుంది.
ముఖ్యంగా వెయిట్ లాస్ కు గ్రేట్ కు సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది.ఇది జీవక్రియ కార్యకలాపాలను రెట్టింపు చేస్తుంది.శరీరంలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.
అతి ఆకలిని అణచివేస్తుంది.మరియు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తినకుండా నిరోధిస్తుంది.
అలాగే బ్లాక్ కాఫీలో విటమిన్ బి, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.అందువల్ల బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు జ్ఞాపకశక్తి( memory)పెరుగుతుంది.
గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.మరియు కాలేయ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
గ్రీన్ టీ విషయానికి వస్తే.ఈ పానియంలో కెఫీన్ తో పాటు క్యాటెచిన్ అనే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.ఇవి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.మరియు కాటెచిన్ శరీరంలోని అదనపు కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తుంది.అలాగే కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడం, గుండె పనితీరును మెరుగుపరచడం, అల్జీమర్స్, డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ అద్భుతంగా తోడ్పడుతుంది.ఇక వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్న వారికి గ్రీన్ టీ మరియు బ్లాక్ కాఫీ రెండు పానీయాలు ప్రభావవంతంగా పని చేస్తాయి.
రిజల్ట్ విషయంలో పెద్ద తేడా ఉండదు.అయితే మొత్తం ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం బ్లాక్ కాఫీ కంటే గ్రీన్ టీనే ఎక్కువ ప్రయోజనకరం.
గ్రీన్ టీతోనే అధిక ఆరోగ్య లాభాలు పొందుతారు.