బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లను పరిచయం చేసింది.ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా పరిచయమైనటువంటి వారిలో హైపర్ ఆది ( Hyper Aadi ) ఒకరు.
హైపర్ ఆది కమెడియన్ గా ఎన్నో అద్భుతమైనటువంటి స్కిట్లు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీగా మారినటువంటి ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ప్రతివారం బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి ఆది తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company ) కార్యక్రమంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పొట్టి నరేష్ తో కలిసి చేస్తున్నటువంటి స్కిట్ అందరి చేత నవ్వులు పూజించింది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే జబర్దస్త్ రాము( Jabardasth Ramu ) పాండురంగడు చిత్రంలోని మాతృదేవో భవ పాటకు చేసిన పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ పర్ఫామెన్స్ చూసిన వారందరూ కూడా ఒకసారిగా ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది రాముతో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.జబర్దస్త్ లో తాను రాణించడం వెనుక ఉన్న వారిలో అదిరే అభితో పాటు రాము పాత్ర కూడా చాలా ఉంది అంటూ ఈయన గత విషయాలను గుర్తు చేసుకున్నారు.నన్ను అవసరంలో ఆదుకున్నది అదిరే అభి అన్న.
కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి ఆకలి తీర్చినవాడు రాము అన్న అంటూ హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం మీ ప్రోమో వైరల్ అవుతుంది.







