ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలకృష్ణ భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.ఇదివరకు సీమ బ్యాక్ గ్రౌండ్లో బాలయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూసాము.
పొలిటికల్ టచ్ చేస్తూ రాయలసీమ రాజకీయాల నేపథ్యంలో బాలయ్య నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.అయితే మొదటిసారి బాలకృష్ణ ( Balakrishna ) తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకుంది.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రస్తుతం అన్ని ప్రాంతాలలోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది అనడంలో ఏ మాత్రం సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదు.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్గా నటించారు.
అయితే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీ లీల నటించారు.తండ్రి కూతుర్ల మధ్య ఇంత మంచి అనుబంధం ఉంటుందా అన్న విధంగా శ్రీ లీల ఈ సినిమాలో పూర్తిగా లీనమైపోయి నటించారు.
ఈ పాత్రకు శ్రీ లీల తప్పితే మరే హీరోయిన్ కూడా ఇంత న్యాయం చేయలేదేమో అన్న సందేహాలు కూడా కలగక మానదు.అంతలా బాలకృష్ణ శ్రీ లీల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారని చెప్పాలి.
ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఒక హీరోయిన్ మాత్రం తెగ బాధ పడుతుందని తెలుస్తోంది.ఎందుకంటే ఈ సినిమాలో విజ్జి పాప పాత్రలో నటించిన శ్రీ లీల( Sreeleela ) ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ కాదని తెలుస్తోంది.
ముందుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ పాత్రలో నటించడం కోసం మరొక అండ్ హీరోయిన్ కృతి శెట్టి( Kriti Shetty ) సంప్రదించారట.ఇలా ఈ పాత్ర కోసం కృతి శెట్టిని సంప్రదించగా ఆమె కూతురి పాత్రనా అంటూ కాస్త సాగదీయడంతో తనకు ఈ పాత్ర ఇష్టం లేదని అనిల్ రావిపూడి గ్రహించారట.
కూతురి పాత్రలో నటిస్తే ఇప్పటికే ఎంతో ఇబ్బందులలో ఉన్నటువంటి తన కెరియర్ మరింత ఇబ్బందులలో పడుతుందని భావించిన కృతి శెట్టి ఈ సినిమాకు నో చెప్పారు.ఇలా ఈ సినిమాకు ఈమె నో చెప్పడంతోనే శ్రీ లీల ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తోంది.ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో కృతి శెట్టి చాలా అన్ లక్కీ హీరోయిన్ అని ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితులలో ఈ సినిమా కనుక చేసి ఉంటే తన కెరియర్ పూర్తిగా టర్న్ అయ్యి ఉండేది అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఇక శ్రీ లీల మొదటి సినిమా పెళ్లి సందడి( Pelli SandaD ) సమయంలోనే తనకు ఈ సినిమా కథ చెప్పారట ఈ సినిమాలో కూతురి పాత్ర అనగానే శ్రీలీలకు కూడా చాలామంది ఈ సినిమాలో నటించకు ఈ సినిమాలో నటిస్తే నీ కెరియర్ ఇంతటితోనే ఆగిపోతుంది హీరోయిన్గా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ సినిమాలో నటించను అని చెప్పేసేయ్ అంటూ తనకు కూడా ఒత్తిడి తీసుకువచ్చారట.అయితే శ్రీ లీల మాత్రం హీరోయిన్ గా నేను ఎన్ని సినిమాలలో అయినా చేయొచ్చు కానీ ఇలాంటి కూతురు పాత్రలో( Daughter Role ) నటించే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు అని భావించి ఈ సినిమాకు కమిట్ అయ్యానని ఓ సందర్భంలో వెల్లడించారు.ఏది ఏమైనా ఈ సినిమాతో శ్రీ లీల మరో హిట్ అందుకున్నారనే చెప్పాలి.
మొత్తానికి ఈ సినిమాని మిస్ చేసుకున్నటువంటి కృతి శెట్టి నిజంగానే అన్ లక్కీ హీరోయిన్ అని మరోసారి రుజువు చేసుకుంది.