విజయ్ సినిమాలో స్టార్ క్రికెటర్ ధోని.. అలా జరిగితే రికార్డులు క్రియేట్ కావాల్సిందే!

మరికొన్ని గంటల్లో స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ సినిమా ( The Greatest of All Time)థియేటర్లలో విడుదల కానుంది.భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాతో విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Star Cricketer Dhoni Playing Key Role In Vijay Movie Details Inside Goes Viral-TeluguStop.com

లియో మూవీ తర్వాత విజయ్ నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.అయితే ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ ధోని( MS Dhoni) కూడా నటిస్తున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ది గోట్ సినిమా క్లైమాక్స్ లో సీఎస్కే మ్యాచ్ ఉంటుందని ఆ సీన్ లో ధోని కనిపిస్తారని తెలుస్తోంది.అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి దర్శకుడు వెంకట్ ప్రభు స్పందిస్తూ ఒకింత కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్ ఇచ్చారు.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ పేరుతో ది గోట్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కోసం మొదట ధోనిని తీసుకొనిరావాలని భావించామని ఆ తర్వాత తీసుకొనిరాలేదని వెంకట్ ప్రభు ( Venkat Prabhu )వెల్లడించారు.

అయితే ధోని ఈ సినిమాలో నిజంగా నటించారో లేదో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.గతంలో లియో సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారని వార్తలు వినిపించగా ఆ వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు.అయితే సినిమా విడుదలైన తర్వాత వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వెల్లడైంది.

ది గోట్ సినిమా కోసం ధోని ఫ్యాన్స్ సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ది గోట్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ది గోట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదలవుతోంది.ది గోట్ సినిమాకు విజయ్ ఏకంగా 220 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube