పవన్ కోసం అదిరిపోయే కథ ఉందంటున్న శ్రీదేవి సోడా సెంటర్ డైరెక్టర్!

సుధీర్ బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.ముందు నుండే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

 Sridevi Soda Center Director Have Story For Pawan Kalyan, Sridevi Soda Center Di-TeluguStop.com

ఈ సినిమా మొన్ననే థియేటర్స్ లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా పలాస సినిమా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

సుధీర్ బాబు సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా అని కూడా ప్రశంస అందించారు.

ఈ సినిమాలో క్లైమాక్స్ హైలెట్ గా నిలిచిందని సినిమా చుసిన చాలా మంది చెబుతున్నారు.ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ కరుణ కుమార్ కు మంచి పేరు వచ్చింది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ కరుణ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన దగ్గర అదిరిపోయే కథ ఉందని ఈయన ఇంటర్వ్యూ లో తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంత వరకు సినిమా చేయలేదని ఒకవేళ ఈ స్టోరీ తో సినిమా చేస్తే వేరే లెవల్లో ఉంటుందని కరుణ కుమార్ చాలా ఉత్సాహంగా తన మనసులోని మాటలు తెలిపాడు.ఈ కథ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తం చూసే విధంగా ఉంటుందని ఆయన తెలిపాడు.

Telugu Karuna Kumar, Pawan Kalyan, Sridevi Soda, Sridevisoda-Movie

మరి తన దగ్గర ఉన్న ఆడిపోయే కథను కరుణ కుమార్ పవన్ కళ్యాణ్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందుతాడో లేదో ముందు ముందు చూడాలి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ రెండు సినిమాలు ఒకేసారి చేస్తూ బిజీగా ఉన్నాడు.క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube